జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ
నిజాంసాగర్ జూన్ 30( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం రోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని, తమ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలతో చదువులో రాణించాలని ఆకాంక్షించారు.
పుస్తకాలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో కామారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన నిజాంసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, కళాశాల అధ్యాపక బృందం, నాయకులు బంగ్లా ప్రవీణ్, చాకలి సాయిలు, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.






