30 June, 2026 | 2:22 PM

దోస్త్ డిగ్రీ ప్రవేశాలు

30-06-2026 01:33 PM

ముకరంపుర, జూన్ 30(విజయక్రాంతి): దోస్త్(DOST Degree Admissions)  మూడవ విడతలో సీటు అలాట్మెంట్ పొందిన విద్యార్థులు జూలై 2వ తేదీలోగా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కరీంనగర్ ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామకృష్ణ తెలిపారు. నిర్ణీత గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయని విద్యార్థుల సీట్లు రద్దు అవుతాయని ఆయన పేర్కొన్నారు.అలాగే దోస్త్ మొదటి, రెండవ, మూడవ విడతల్లో సీటు పొంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులు జూలై 4వ తేదీలోగా కళాశాలలో కాలేజ్ కన్ఫర్మేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

కాలేజ్ కన్ఫర్మేషన్ కోసం ఇంటర్మీడియట్ ఒరిజినల్ టి.సి.తో పాటు ఇతర అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను కళాశాలలో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. గడువు తేదీలోగా కాలేజ్ కన్ఫర్మేషన్ పూర్తి చేయని విద్యార్థుల సీట్లు  రద్దు అవుతాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ వెల్లడించారు. విద్యార్థులు నిర్ణీత తేదీలను గమనించి తమ ప్రవేశ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు.