పార్టీ ఆదేశానుసారం బిఎల్ఓలు సర్ కార్యక్రమంలో పాల్గొనాలి
బోథ్, జూన్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాల ప్రకారం బిఎల్వోలు సర్ కార్యక్రమంలో పాల్గొని ఓట్లు గల్లంత కాకుండా చూసుకోవలసిన బాధ్యత ఉందని సోనాల మండల సర్ అబ్జర్వర్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సోనాల మండల కేంద్రంతో పాటు సాకేర గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి బిఎల్ఓ2 లతో సమావేశం నిర్వహించారు. మండలంలో ఇప్పటికే 80% ఓటర్ నమోదు కార్యక్రమం బిఎల్ఓలతో కలిసి కాంగ్రెస్ పార్టీ బి ఎన్ ఓ లు సమన్వయంతో నిర్వహిస్తున్నారు అన్నారు.
పార్టీ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డిసిసి కార్యదర్శి లోపు పోశెట్టి చౌహాన్ హరి సింగ్ సోనాల మండల పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న సర్పంచుల సంఘం అధ్యక్షులు చౌహాన్ యూనివర్సిటీ చింతల బోరి సర్పంచ్ గైక్వాడ్ శ్రీరామ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మునేశ్వర సోమన్న ఆత్మ డైరెక్టర్ ముందే శ్రీధర్ బోత్ సోనాల మండలాల సీనియర్ నాయకులు నరసింహ దాస్ సుదర్శన్ చెట్లపల్లి అశోక్ భీమ్రావు పాటిల్ పోతన్న నానాజీ రమేష్ రాజారాం సంతోష్ రామ్ చందర్ ధనరాజ్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు.






