జంగారెడ్డిపల్లిలో ఓటర్ల వివరాల సేకరణ
30-06-2026 01:56 PM
ఇంటింటి సర్వే నిర్వహించిన బీఎల్‌ఓ, బీఎల్‌ఏలు
ఆమనగల్లు, జూన్ 30: మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు జంగారెడ్డిపల్లి (బూత్ నెంబర్ 204)లో మంగళవారం బీఎల్‌ఓ, బీఎల్‌ఏలు ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటరు జాబితా వివరాలను పరిశీలించారు. అర్హులైన కొత్త ఓటర్ల వివరాల సేకరణతో పాటు, అవసరమైన మార్పులు-చేర్పులపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి సూచనలు అందించారు. ఈ సర్వే కార్యక్రమంలో కౌన్సిలర్ దుడ్డు ఆంజనేయులు యాదవ్, బీఎల్‌ఓ సికిందర్, బీఎల్‌ఏలు జంతుక అల్లాజీ, జంతుక రమేష్ తదితరులు పాల్గొన్నారు.






