16 March, 2026 | 5:12 AM

కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన

16-03-2026 12:41 AM

మెడికవర్ హాస్పిటల్స్‌లో ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి) : ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెడికవర్ హా స్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ వరల్డ్ కిడ్నీ డే రైడ్ పే రుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా, మెడికవర్ హా స్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రత్యే క జుంబా ఫిట్నెస్ సెషన్ నిర్వహించారు.

బైక్ ర్యాలీకి ప్రముఖ బైకర్స్ సమూహం హర్లీ ఓనర్స్ గ్రూప్ బంజారా చాప్టర్ సహకరించింది. సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్రముఖ నటుడు మహేష్ ఆచంట పాల్గొని కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. హైటెక్‌సిటీలో జుంబా ఫిట్నెస్ సెషన్‌కు నటు డు విరాజ్ అశ్విన్ పాల్గొన్నా రు. ఆరోగ్యకరమైన జీవనశైలిలో వ్యాయామం, ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా డా.ఎం రమేష్, మెడికవర్ హాస్పిటల్స్ నెఫ్రాలజీ విభాగం హెడ్ డా. కమల్ కిరణ్, నెఫ్రాలజిస్ట్ డా. అ రుణ్,  మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి అవసరం. సరైన జీవనశైలి, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చు అని అన్నారు. మధుమేహం, రక్తపోటు ఉన్నవా రు కిడ్నీ ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయొ ద్దని, ప్రారంభంలోనే సమస్యను గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది అన్నారు.