4 September, 2026 | 10:40 PM

Breaking News

శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •  

అనారోగ్య బాధితుడికి రూ.1.15 లక్షల ఎల్ ఓసి మంజూరు

30-06-2026 | 01:52pm

సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని, జూన్ 30(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన తాళ్లపల్లి దుర్గయ్యకు వైద్య చికిత్స కోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో సీఎంఆర్ఎఫ్  ద్వారా రూ.1,15,000 విలువైన ఎల్‌ఓసీ  మంజూరైంది. ప్రస్తుతం దుర్గయ్య హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.15 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

మంత్రి హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీని అందజేశారు. మంత్రి చొరవతో సకాలంలో ఆర్థిక సాయం అందడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ కష్టసమయంలో అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పేదల వైద్య అవసరాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరంతరం సహాయం అందిస్తూ, అవసరమైన వారికి అండగా నిలుస్తున్న మంత్రి శ్రీధర్ బాబు సేవలు ప్రశంసనీయమని స్థానికులు పేర్కొన్నారు.