5 August, 2026 | 2:46 AM

తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

05-08-2026 12:10 AM

కలెక్టర్ అనురాగ్ జయంతి

యాదగిరిగుట్ట, ఆగస్టు 4: అంగన్వాడీ కేంద్రానికి వచ్చే తల్లి,బిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులు, అంగన్వాడి సిబ్బందికి సూచించారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని అంగడి బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం3 ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో నమోదైన చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతల వివరాల సంఖ్య ఎంత అని , వారందరూ ప్రతిరోజూ కేంద్రానికి హాజరవుతున్నారా లేదా అనే వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

హాజరును ఏ విధంగా నమోదు చేస్తున్నారని, అటెండెన్స్ నిర్వహణ ను పరిశీలించారు. చిన్నారులకు ప్రతిరోజూ ఏ విధమైన పోషకాహారం ఇస్తున్నారని , చదువు,ఆటల ఏ విధంగా నేర్పిస్తున్నారని అంగన్వాడీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అనంతరం చిన్నారులకు రంగులు, బొమ్మలు చూపించి వాటి పేర్లు చెప్పించాలని ప్రోత్సహిస్తూ వారి అభ్యాస స్థాయిని పరిశీలించారు.

గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందుతున్నదా అని , పాలు, గుడ్లు, పప్పులు తదితర పోషకాహార పదార్థాలు తగినంతగా సరఫరా అవుతున్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్లతో మాట్లాడుతూ,విధులు నిర్వహిస్తున్న బీఎల్వోలుగా వారు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)కు సంబంధించిన అన్ని ఫారాలను అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి సేకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.