8 May, 2026 | 3:49 AM

హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ నరసింహ

08-05-2026 12:00 AM

కోదాడ, మే 7: కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా జరిగిన మహిళ హాత్యకు సంబంధించి ఘటన స్థలాన్ని గురువారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. సంఘటన జరిగిన చోట దుకాణదారులను ఆరా తీశారు, సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, రిమాండ్ కు తరలించాలని తెలిపారు, జైలు శిక్ష పడేలా దర్యాప్తు చేసి సాక్షులను బాధితులను విచారించి నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడేవారు ఎంతటి వారైనా పోలీస్ శాఖ ఉపేక్షించమని చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎస్పీ వెంట స్థానిక డిఎస్పి శ్రీనివాసరెడ్డి, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివశంకర్, ఎస్త్స్ర సుధీర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.