8 May, 2026 | 2:50 AM

స్వీయ గణనలో వివరాలు నమోదు చేసుకోవాలి

08-05-2026 12:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

సూర్యాపేట, మే 7 (విజయక్రాంతి) : స్వీయ గణన చేసుకునేందుకు ఇంకా కేవలం 3 రోజులు మాత్రమేగడువు ఉందని,  జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత, మహిళా సంఘాలు, ఐటీ రంగ నిపుణులు మరియు అన్ని వర్గాల వారు స్వీయ గణన  పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ప్రకటనలో కోరారు. తమ వివరాలను నమోదు చేసుకోని వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

జనగణన ’సంబంధించి స్వీయ గణన’  మే 10 వరకు అవకాశం ఉందని, మొదటి దశలో భాగంగా నిర్వహించే ’గృహ లెక్కింపు, గృహ పరిస్థితుల లెక్కింపు కోసం ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉందన్నారు..

జిల్లా ప్రజలు తమ ఇంటి మరియు కుటుంబ వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టల్ https://se.census.gov.in ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని, మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారానైనా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చనీ పేర్కొన్నారు.