10 April, 2026 | 7:22 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ

10-04-2026 12:00 AM

మెదక్, ఏప్రిల్ 9(విజయ క్రాంతి) : మెదక్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తనిఖీ చేశారు. మొదటగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన పరిశుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, ఎలాంటి పెండెన్సీ లేకుండా చూడాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సీసీ కెమెరాల పనితీరుపై ఎస్హెచ్‌ఓ మహేష్ నుండి వివరాలు తెలుసుకొని, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజూ సాయంత్రం వాహనాల తనిఖీలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించిన ఎస్పి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని హితవు పలికారు. ఎస్పీ వెంట  మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్, ఎస్బి ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎసై లు మల్లికార్జున్, విఠల్ సిబ్బంది ఉన్నారు.