నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి
- హుస్నాబాద్ ఏసీపీ సదానందం
- రూ. 2.10లక్షలు విరాళాలు స్వీకరణ
కోహెడ: నేరాల నియంత్రణ కోసం గ్రామం లో సీసీ కెమెరాల ఏర్పాటులో గ్రామస్తులు భాగస్వామ్యులు కావాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామంలో చట్టా వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టుటకు పోలీస్ లకు సులువు కానుందన్నారు. గ్రామం లోని ప్రజాప్రతినిధులు, సంపన్నులు, వ్యాపారులు, స్వచ్ఛoదంగా విరాళాలు అందించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
కాగా మెడికల్ అండ్ డాక్టర్ యూనియన్ నుంచి రూ.60 వేలు, వార్తక వాణిజ్య సంఘము నుంచి రూ.50 వేలు, పర్టీలెజర్ యూనియన్ నుంచి రూ.50 వేలు, ట్రాక్టర్, జేసీబీ, అర్వెస్టర్ యూనియన్ ద్వారా రూ.50 వేలు విరాళాలు సమాకూర్చిన ఎస్ఐ అభిలాష్ ను ప్రత్యేకంగా అభినందించారు. కోహెడలో నాలుగు దిక్కుల ప్రధాన రహదారులలో 30 కెమెరాలు తగ్గకుండా ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమం లో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




