దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు
సుల్తానాబాద్, 10(విజయ క్రాంతి): ఈ నెల 17 18 తేదీలలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే రెండవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్, పేరుక లక్ష్మణ్, పేరుక సతీష్, క్యాదాసి రాజు, మోల్గూరి కళ్యాణ్, ఇంజపురి దేవదాస్, కల్వల మహేష్, కవ్వంపల్లి సాయినాథ్లు లు శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పోస్టర్ ఆవిష్కరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ... తరతరాలుగా అణిచివేత అంటరానితనం వివక్షత దోపిడి పీడనాల కింద నలిగిపోతున్న అట్టడుగు వర్గాలైన ఆశేష శ్రామిక కులాల అభ్యున్నతి లక్ష్యంగా ఆవిర్భవించిన దళిత హక్కుల పోరాట సమితి అత్యంత దారుణంగా బలైపోతుందన్నారు, దళితులను సామాజిక ఆర్థిక రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించి అనిచివేతలను ఎదిరించి సమానత్వాన్ని సాధించేందుకు గాను సంఘటితంగా చైతన్యవంతం చేయడానికి ఏకైక ప్రధాన లక్ష్యంతో దళిత సామాజిక దృక్పథంతో తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలు వరంగల్ పట్టణంలోని పోచమ్మ మైదానం అబ్నుస్ ఫంక్షన్ హాల్ లో ఈనెల 17 18 తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
76 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో నేటికీ దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని సమానత్వం సామాజిక న్యాయం కుల నిర్మూలన కాగితాలకే పరిమితమైందని తాళ్లపల్లి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళిత బలహీన వర్గాల హక్కుల కొరకు అభివృద్ధికి రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్లు కొన్ని సంవత్సరాలుగా పాలకులు అమలుపరుస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు ప్రైవేటీకరణ విధానాల వలన రోజురోజుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపన లేక ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు
కరించటం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలలో ఉపాధి కల్పించు సంస్థలు లేక కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానాలు ప్రవేశపెట్టడం వలన రిజర్వేషన్ల ఉనికికే ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాక్లాగ్ ఉద్యోగుల భర్తీలో కేంద్ర ప్రభుత్వం పనితీరు ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేశారు. వీటన్నిటికీ నిరసనగా జరిగే దళిత హక్కుల పోరాట సమితి రెండవ రాష్ట్ర మహాసభలను రాష్ట్రవ్యాప్తంగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాల్లపల్లి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. రెండు రోజుల మహాసభలలో ముందస్తు ప్రణాళిక కార్యాచరణలతోపాటు తీసుకోవలసిన జాగ్రత్తలు ఆందోళన కార్యక్రమాలను రాష్ట్ర నాయకత్వం చర్చించి పలు సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అట్టడుగు వర్గాలు దళితులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.




