కొమ్ముగుడెంలో సిసి రోడ్లు ప్రారంభించిన సోయం వీరభద్రం
05-05-2026 06:09 PM
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొమ్ముగుడెం గ్రామం లో గ్రామ పంచాయతీ సర్పంచ్ సోయం సత్యవతి ఆధ్వర్యంలో సి.సి రోడ్లు కి భూమి పూజ అనంతరం జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు సోయం వీరభద్రం కొబ్బరికాయ కొట్టిన పనులు ప్రారంభంచారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన సవలం రాముడు, సూరమ్మ దంపతుల కుమారుడు "రాఘవయ్య-కనకలక్ష్మి"ల పరిశుద్ధ వివాహానికి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి హాజరయి నూతన వధువరులను ఆశీర్వధించి, శుభాకాంక్షలు తెలిపారు.






