18 March, 2026 | 5:11 PM

మండలి మీడియా గ్యాలరీలో పనిచేయని సౌండ్ సిస్టం

18-03-2026 12:36 AM

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి) : బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం తెలుపుతూ సభ్యులు మాట్లాడారు. అయితే మండలిలోని మీడియా గ్యాలరీలో సౌండ్ సిస్టం సరిగా పనిచేయలేదు. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు, మండలి చైర్మన్ ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా వినబడక, అర్థంకాక జర్నలిస్టులు ఇబ్బందులు పడ్డారు.