28 February, 2026 | 2:30 PM

కన్నతల్లిపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన తనయుడు

28-02-2026 12:47 PM

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు...

బాన్సువాడ,(విజయక్రాంతి): కన్న కొడుకులు తోడుగా ఉంటారని కన్న తల్లిదండ్రులు(Parents) ఎన్నో ఆశలు పెట్టుకున్నాపాటికి, ఆ కన్న కొడుకులే యములుగా మారుతున్నారు. మద్యానికి బానిసై కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యలను సైతం చూడకుండా హత్యలకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా నవ మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన ఆ చిన్నారులను సైతం ఈ మానవ మృగాలు హత్యలకు పాల్పడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా(Nizamabad District) కోటగిరి మండలం బ్రాహ్మణ గల్లీ లో మద్యం మత్తులో ఉన్న ఓ తనయుడు తన కన్నతల్లిని ప్రాణాలతో ఉండగానే  సజీవదహనం చేసిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.శుక్రవారం రాత్రి బ్రాహ్మణగల్లికి చెందిన మానాజీ అనే వ్యక్తి, మద్యానికి బానిసై, తన తల్లి భూమవ్వపై దాడి చేసి, ఇంట్లోని పాత బట్టలు వేసి నిప్పు పెట్టి కాల్చి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.