కొన్ని పరిచయాలు
31-08-2026 12:03 AM
కొన్ని పరిచయాలు
పువ్వులుగా విరబూసి
పరిమళాలు వెదజల్లుతాయి
కొన్ని జ్ఞాపకాలు
నూతిలో ఊరుతున్న
నీళ్ల వలె తీపి రుచినిస్తాయి
కొన్ని నిరీక్షణలు
ఘనీభవించిన కాలంతో కలసి
మనసులో శాశ్వితంగా
ముద్రలుగా నిలిచిపోతాయి
కొన్ని విరహాలు
గుండెలో దాగి ఉన్న
చివరి నీటి బొట్టును
సైతం అవిరిచేస్తాయి.. కొన్ని ప్రేమలు
దేహాలను దాటుకుని
ఆత్మలుగా పెనవేసుకుని
చరిత్రలో సదా నిలిచిపోతాయి
శ్రిష్టి శేషగిరి






