9 August, 2026 | 3:12 AM

మహిళా కోటా బిల్లుకు ‘అకాలీదళ్’ మద్దతు

09-08-2026 12:50 AM
  1. డీ లిమిటేషన్ బిల్లుకు కూడా
  2. ఎస్‌ఏడీ అధినేత సుఖ్‌బీర్ సింగ్

న్యూఢిల్లీ, ఆగస్టు 8: పంజాబ్ శిరోమణి అకాలీదళ్ పార్టీ మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు ప్రకటి ంచారు. శనివారం చండీగఢ్‌లో సీనియర్ నాయకులతో సమావేశమైన ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా బిల్లు రిజర్వే షన్లు తక్షణమే అమలు చేయాలని, వారి న్యాయమైన ప్రాతినిధ్యాన్ని వెంటనే కల్పించాలన్నారు.

మహిళల గౌరవం, సమాన త్వం, సమాన హక్కుల కోసం పోరాడిన సిక్కు గురువుల బోధనల నుంచి ఎస్‌ఏడీ స్ఫూర్తి పొందిందన్నారు. ఇప్పటికే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీలో మహిళలకు స్థానం కల్పించి ఆదర్శంగా నిలిచా మన్నారు. కాగా ఒక రోజు ముందే శుక్రవారం సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రధానితో భేటీ అయ్యారు. 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తుపై పలు ఊహాగానాలు, వార్తలు వెలువడ్డాయి.

2029లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్, 816 స్థానాలకు నియోజకవర్గాలను పెంచాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతోంది. ఆగస్ట్ 16 లేదా 18న పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశంలో ఈ రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్నారనే వాదన వినబడుతున్నా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఖండించారు.

మాది విజ్ఞానాన్ని పంచే సంభాషణ: రాఘవ్ చద్దా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ ఆసక్తిని కలిగించిందని, బీజేపీ ఎం పీ రాఘవ్ చద్దా అన్నారు. శనివారం ఉ దయం చద్దా ప్రధానితో భేటీ అయ్యా రు. అనంతరం ఎక్స్ వేదికగా ప్రకటన వి డుదల చేశారు. ప్రధాని సమయం కేటాయించినందుకు హృదయపూర్వక కృతజ్ఞ తలు తెలిపారు. కాగా ఆరుగురు ఎంపీలతో బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా రానున్న పంజాబ్ ఎన్నికల్లో పాత్ర, పనులపై చర్చ జరిగినట్లుగా భావిస్తున్నారు.