20 August, 2026 | 4:12 AM

బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్ బాల్య వివాహంతో బతుకు ఆగం

20-08-2026 12:00 AM

తంగళ్ళపల్లి, ఆగస్టు 19 (విజయ క్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టి, బాలల హక్కులను కా పాడేందుకు గ్రామస్థులు చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర బాలల హ క్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె పేర్కొ న్నారు. ప్రతి బాలికకు విద్య, రక్షణ, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గ్రామస్థులు, నాయకులు ప్రజాప్రతి నిధులు, అధికారుల ఉన్నారు. బాల్య వివాహాలు జరగని గ్రామంగా అంకుసాపూర్ నిలవడం స్ఫూర్తిదాయకమని తెలిపారు.