27 April, 2026 | 12:16 PM

Breaking News

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం   •   న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •  

నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి

27-04-2026 10:19 AM

హైదరాబాద్: నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి-అద్దంకి రోడ్డులో(Narketpally-Addanki Road) సోమవారం తెల్లవారుజామున వేగంగా వస్తున్న కారు నిలిచి ఉన్న లారీని ఢీకొనడంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సందీప్ మృతి చెందాడు. సందీప్ నర్సంపేట నుండి హైదరాబాద్ వెళ్తుండగా, పనగల్లు ఫ్లైఓవర్‌పై(Panagal Flyover) ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.