12 July, 2026 | 4:13 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

07-03-2026 12:04 AM

కర్ణాటకలో 16 .. ఏపీలో 13 ఏళ్ల లోపు వారికి ఆంక్షలు

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయం

పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకూడదనేనని ప్రకటన

బెంగళూరు/అమరావతి, మార్చి 6 : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. కర్ణాటకలో 16ఏళ్లు, ఏపీలో 13ఏళ్ల లోపు  పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య , నారా చంద్రబాబునాయుడు తమ అసెంబ్లీలలో ప్రకటించారు. రాబోయే 90 రోజుల్లోగా దీనికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇక 13 నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించాలనే దానిపై ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. దీనిపై అందరితో చర్చించి, ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.  పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.