8 March, 2026 | 6:46 AM

సివిల్స్ టాపర్‌గా డాక్టర్

07-03-2026 12:27 AM
  1. ప్రథమ స్థానంలో నిలిచిన రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి

19మంది తెలుగు తేజాలకూ ర్యాంకులు

23వ ర్యాంకుతో సత్తాచాటిన జశ్వంత్ చంద్ర

సివిల్స్ ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ

న్యూఢిల్లీ, మార్చి 6: భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలు శుక్రవారం విడుద లయ్యాయి. సివిల్స్ టాపర్‌గా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి నిలిచారు. అనుజ్ ఎయిమ్స్ జోధ్‌పూర్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి యూపీఎస్సీ ప్రయా ణాన్ని ప్రారంభించి చివరకు విజయం సాధించారు. రెండో స్థానంలో తమిళనాడులోని మదురైకి చెందిన రాజేశ్వరి, ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూ తన 5వ ప్రయత్నంలో ఈ విజయాన్ని అందుకున్నారు.

ఇక ఆకాన్ష్ ధుల్ తొలి మూ డు ర్యాంకులతో సత్తా చాటగా.. పలువురు తెలుగు విద్యార్థులు సివిల్స్‌లో మెరిశారు.  మొత్తం 1087 ఖాళీలకు గాను, యూపీఎస్సీ ప్రస్తుతానికి 958 మంది అభ్యర్థులను వివిధ సర్వీసులకు సిఫార్సు చేస్తూ జాబితాను ప్రకటించింది. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి  317 మంది ఉండగా.. ఈడబ్ల్యూఎస్ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ నుంచి 73 మంది చొప్పున ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.  

యూపీఎస్సీ టాప్‌హే అభ్యర్థులు వరుసగా..

 అనుజ్ అగ్నిహోత్రి,  రాజేశ్వరి సువే  ఆకాంష్ ధుల్,  రా ఘవ్ ఝున్ఝున్వాలా,  ఈషాన్ భట్నాగర్, జినియా అరోరా , ఏ.ఆర్. రాజా మోహైదీన్,  పక్షల్ సెక్రటరీ, ఆస్థ జైన్, ఉజ్వల్ ప్రియాంక్, యశస్వి రాజ్ వర్ధన్, అక్షిత్ భరద్వాజ్, ఆన్య శర్మ, సురభి యాదవ్, సిమ్రన్దీప్ కౌర్, మోనికా శ్రీవాస్తవ, చిత్వాన్ జైన్, శృతి ఆర్, నిషార్ దిశాంత్ అమృతలాల్, రవి రాజ్ ఉన్నారు. 

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..

సివిల్స్ ఫలితాల్లో పలువురు తెలుగు విద్యార్థులు మెరిశా రు. జశ్వంత్ చంద్ర 23వ ర్యాంకుతో సత్తాచాటగా.. సృజన 55వ ర్యాంకు,  భానోత్ లక్ష్మీ రచన 178, డీఎస్కే ప్రచేత్ 193, ఎస్ వర్షిత్ రెడ్డి 259, ఎం.పవన్కుమార్ రెడ్డి 297, వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541, గుమ్మల శ్వేత 573, పల్లి ప్రమోద్ విష్ణు 640, గుమ్మల విజయసింహారెడ్డి 682, పోతుపురెడ్డి భార్గవ్ 738, పుడారి రాహుల్ 748, కుమ్మరి శ్రవణ్కుమార్ 768, అనిరుధ్ కత్తిమాని 786, కోరపోతుల శ్రీకర్రాజు 806, ఇస్లావత్ శ్రీరామ్ హర్ష 823, కట్టా ప్రత్యూష 908, గోగుల రాజశేఖర్ 920, గుగులోతు జితేందర్ నాయక్ 939వ ర్యాంకులతో తమ విశేష ప్రతిభను చాటారు. 

15 రోజుల్లోగా మార్కుల జాబితా

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సహా పలు సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూపీఎస్సీ యేటా సివిల్స్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుం ది. గతేడాది సివిల్స్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. మే 25న జరిగిన ప్రిలిమ్స్లో సత్తా చాటిన వారికి 2025 ఆగస్టు 22 నుంచి 31 వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు.

మెయిన్ పరీక్షలో అసాధారణ ప్రతిభను కనబరిచిన వారికి డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు దశల వారీగా ఇంటర్వ్యూలను నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించారు. ఈ పరీక్ష,నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం లేదా స్పష్టత కోసం ఫెసిలిటేషన్ కౌంటర్ ఏర్పాటు చేశారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వయంగా వెళ్లి గానీ లేదా 23385271/ 23381125 /23098543 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధిం చిన మార్కులను 15 రోజుల్లోపు తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. 

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు 

ఈ ఏడాది మొత్తం 1087 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, కేటగిరీల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి: ఐఏఎస్ (భారత పరిపాలనా సేవ): 180 పోస్టులు (జనరల్-74, ఓబీసీ-47, ఎస్సీ-28, ఎస్టీ-13, ఈడబ్ల్యూఎస్ -18) ఐపీఎస్ (భారత పోలీస్ సేవ): 150 పోస్టులు (జనరల్-60, ఓబీసీ42, ఎస్సీ-22, ఎస్టీ--11, ఈడబ్ల్యూఎస్ -15) ఐఎఫ్‌ఎస్ (భారత విదేశీ సేవ): 55 పోస్టులు. 

ఇతర కేంద్ర  సర్వీసులు: గ్రూప్ ’ఎ’లో 507, గ్రూప్ ’బి’లో 195 పోస్టులు ఉన్నాయి.