19 May, 2026 | 12:25 AM

తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ

07-05-2026 02:01 PM

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ

సంఖ్యాబలం చూపించాలన్న గవర్నర్

విజయ్ ప్రమాణస్వీకారంపై కొనసాగుతున్న టెన్షన్

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కోసం టీవీకే అధినేత విజయ్ ప్రయత్నిస్తున్నారు. అయితే పూర్తి మెజారిటీ కోసం ఇంకా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సంఖ్యాబలం నిరూపించాలని సూచించారు.

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే(Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ 24 గంటల్లో రెండుసార్లు గవర్నర్ ను కలిశారు.  ఇవాళ 45 నిమిషాల పాటు ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తో చర్చలు జరిపారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ ను కోరారు. విజయ్ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంఖ్యాబలం చూపించాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ కోరారు. విజయ్ సమర్పించిన మద్దతు లేఖపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటామని గవర్నర్ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ మద్దతు తెలిపినా పూర్తి మెజారిటీకి టీవీకేకు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల మద్దతు పొందేందుకు టీవీకే తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

అటు డీఎంకే అధినేత స్టాలిన్ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతోంది. పార్టీ ముఖ్య నేతలతో స్టాలిన్ సమావేశమయ్యారువామపక్షాలు, వీసీకే నేతలు స్టాలిన్‌ను కలసి భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చిస్తున్నారు. 

తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న తాజా పరిణామాలు తెలుసుకోవాలంటే మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

డీఎంకే కూటమి మద్దతు లేకుండా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీవీకే విజయ్ కు మద్దతు ఇచ్చే అంశంపై చర్చించారు. వీసీకే, వామపక్షాలు డీఎంకే కూటమిలో ఉన్నాయి. స్టాలిన్ ను ఒప్పించిన తర్వాతే వీసీకే, వామపక్షాలు విజయ్ కు మద్దతు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

HIGHLIGHTS

విజయ్ గవర్నర్‌ను 24 గంటల్లో రెండుసార్లు కలిశారు

ప్రభుత్వం ఏర్పాటుకు సంఖ్యాబలం చూపాలని గవర్నర్ సూచన

టీవీకేకు ఇంకా 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం

కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించింది

స్టాలిన్ నివాసంలో కీలక సమావేశం

ఇలాంటి రాజకీయ విశ్లేషణలు, తాజా అప్‌డేట్స్ కోసం మా పొలిటిక్స్ విభాగాన్ని ఫాలో అవ్వండి.

FAQ's

 1. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు ఎవరు చేయబోతున్నారు?

ప్రస్తుతం టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

2. విజయ్‌కు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం?

పూర్తి మెజారిటీకి ఇంకా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

3. గవర్నర్ ఏమన్నారు?

ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సంఖ్యాబలం నిరూపించాలని గవర్నర్ సూచించారు.


ఇవి కూడా చదవండి:

‘విజయ్ అనే నేను’.. సీఎం పీఠం ఖాయం?

TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు

గవర్నర్‌ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్

విజయ్‌కు షాక్ ఇచ్చిన గవర్నర్!