బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు
గుండాల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులను సోమవారం గుండాల పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పిలుపుమేరకు అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు వినతి పత్రం ఇచ్చేందుకు గుండాల మండలం నుండి కదిలిన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ అధికార ప్రతినిధి టి రాము, పార్టీ సీనియర్ నాయకులు గడ్డం వీరన్న, పొంబోయిన సుధాకర్ లను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ.. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తమను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.






