8 May, 2026 | 2:57 AM

శౌర్యానికి ప్రతీక సిందూర్

08-05-2026 12:50 AM
  1. ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం
  2. ౧౦౦ మందికిపై గా ఉగ్రవాదులను మట్టుపెట్టాం
  3. ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ, మే ౭: భారత సైన్యం శౌర్య పరాక్రమాలకు ప్రతీక ‘ఆపరేషన్ సిందూర్’ అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఈ ఆపరేషన్ ద్వారా సైన్యం భారత సరిహద్దుల్లోని లష్కర్ ఏ తొయిబా, జైషే మహ మ్మద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన తొమ్మి ది ప్రధాన లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసిందని గుర్తుచేశారు. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిందని వెల్లడించారు. ఆపరేషన్‌కు ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం ప్రధాని తన సోషల్‌మీడియా ఖాతాల ‘డీపీ’లో తన ఫొటోకు బదులుగా ఆపరేషన్ సిందూర్ లోగో పెట్టారు.

ఈ సందర్భంగా యావత్ భారతవనికి సందేశమిచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సాయుధ బలగాల పరాక్రమాన్ని వెలకట్టలేమని ప్రధాని కొనియాడారు. పహల్గాంలోఅమాయక భారతీయులను పొట్టన పెట్టునపెట్టుకున్నందుకు ప్రతిగా, భారత్ ఉగ్రవాదానికి గట్టి సమాధానమిచ్చిన సందర్భమని గుర్తుచేసుకున్నారు. దేశ ప్రజలం దరూ తమ సోషల్ మీడియా ఖాతాలకు సం బంధించిన ‘డీపీ’ల్లో ‘ఆపరేషన్ సిందూర్’ లోగో పెట్టాలని పిలుపునిచ్చారు.