శోభన్‌బాబు సతీమణి కన్నుమూత
11-07-2026 12:00 AM
దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి (96) గురువారం కన్నుమూశారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆమె కొంతకాలంగా వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, అక్కడి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం చేరారు. ఆమెను పరామర్శించడానికి వచ్చిన ఓ స్నేహితురాలితో మాట్లాడుతున్న సమయలోనే అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుకు గురై, తుదిశ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని వారి నివాసానికి తరలించారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. శోభన్‌బాబు దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.






