31 July, 2026 | 8:13 PM

వర్షాకాలంలో విద్యుత్ భద్రత పాటించాలి

31-07-2026 07:22 PM

రామగిరి ఏఈ తూర్పాటి స్వామి

రామగిరి,(విజయక్రాంతి): విద్యుత్ వినియోగదారులు వర్షాకాలంలో జాగ్రత్తలు పాటించాలి అని కమాన్ పూర్ ఎన్పీడీసీఎల్ సెక్షన్ ఏఈ, తూర్పాటి స్వామి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మీ అప్రమత్తతే మీ రక్షణ... మీ కుటుంబ భద్రత అందరి లక్ష్యం అని అన్నారు. వర్షా కాలంలో ప్రతి వినియోగదారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన వివరించారు. తడి చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ముట్టుకో రాదని తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే, వాటికి దూరంధోద్ద ఉండి వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యుత్ స్తంభాల వద్ద ట్రాన్స్ఫార్మర్ల కు దూరంగా ఉండాలని సర్వీస్ వైర్ తెగిపడితే ముట్టుకో రాదని సూచించారు.

ప్రతి ఇంటికి ఎర్త్ వైర్ తప్పకుండా పెట్టుకోవాలని అటువంటి సమయంలో ప్రమాదాలు జరుగవని అన్నారు. ఏదైనా విద్యుత్ పరికరాలు నీటిలో పడి ఉన్న సమయంలో వాటిని ముట్ట రాదని దానికి దూరంగా ఉండాలని అన్నారు. వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కు పచ్చి చెట్లు తాగితే దూరంగా ఉండాలని అలాగే వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అన్నారు. చిన్న పిల్లలను విద్యుత్ పరికరాలకు, వైరు దూరంగా ఉంచాలని కోరారు. విద్యుత్ సంబంధిత అత్యవసర పరిస్థితటల్లో వెంటనే సమీప విద్యుత్ కార్యాలయానికి లేదా టోల్ ఫ్రీ 1912 కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రతి వినియోగదారులు సలహాలు సూచనలు పాటించాలని అన్నారు.