24 August, 2026 | 2:33 PM

పేదల సబ్సిడీకి స్మార్ట్ మీటర్ల కుట్ర.?:

24-08-2026 01:24 PM

రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్! 

హైదరాబాద్ ఆగస్టు24 (విజయక్రాంతి): రేవంత్ సర్కార్‎పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మళ్లీ విరుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల వైపు కాకుండా పెద్దల వైపు ఉన్నది మరోసారి బయటపడిందని విమర్శించారు. కార్పొరేట్లతో కుమ్మకై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఎత్తేయాలని కుట్రకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్లు తీసుకొస్తున్న తలా తోక లేని విధానాలను సమర్థిస్తోంది. అదానీలకు కొమ్ముకాస్తూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నది. గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.