24 August, 2026 | 2:21 PM

విద్యార్థులను గందరగోళంలోకి నెట్టిన తుగ్లక్ రేవంత్!

24-08-2026 01:08 PM
  1. సీఎం రేవంత్ రెడ్డి 97 జీవోను రద్దు చేయండి
  2. స్కిల్ యూనివర్సిటీకి మేము వ్యతిరేకం కాదు
  3. స్కిల్ వర్సిటీ కేవలం డిగ్రీలు ఇవ్వడానికే పరిమితం
  4. విద్యార్థులను గందరగోళంలోకి నెట్టారు

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులతో(Polytechnic Students) కలిసి బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్(BRS Leaders Press Meet) నిర్వహించారు. 97 జీవో రద్దు కోసం విద్యార్థులు పది రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీ(Skill University) పరిధిలోకి తేవడాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

రకరకాల జీవోలో తెచ్చి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టిన తుగ్లక్ రేవంత్(Revanth Reddy) అని వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ వర్సిటీ కేవలం డిగ్రీలు ఇవ్వడానికే పరిమితమని చట్టంలో పేర్కొన్నారు. ఈ నిమిషానికి స్కిల్ యూనివర్సిటీకి AICTE గుర్తింపు లేదని వివరించారు. స్కిల్ యూనివర్సిటీకి తాము వ్యతిరేకం కాదన్న మాజీ ఎంపీ వినోద్ పాలిటెక్నిక్ వ్యవస్థను కొనసాగిస్తూనే స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.