అక్రమ భవనాలను త్వరలో కూల్చేస్తాం: 'హైడ్రా' కమిషనర్
అక్రమ నిర్మాణాలపై హైడ్రా ప్రత్యేక డ్రైవ్
హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్(Anjaiah Nagar)లో కూలిన భవనాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner Ranganath) పరిశీలించారు. కూలిన భవనం పక్కనే ప్రమాదకరంగా మారిన మరో భవనాన్ని రంగనాథ్ పరిశీలించారు. 7-8అంతస్తులు అక్రమంగా నిర్మించారని తెలిపారు. ఇల్లు పునాది సరిగ్గా లేకపోవడం వల్లే భవనాలు కూలుతున్నాయని వెల్లడించారు. 40 గజాల్లో 8 అంతస్తుల్లో అక్రమ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదన్నారు.
అంజయ్యనగర్ లో ప్రమాదకరంగా ఉన్న 8 భవనాలను గుర్తించామన్న హైడ్రా కమిషనర్(HYDRA Commissioner) ఎనిమిది అక్రమ భవననాలను త్వరలో కూలుస్తామని సూచించారు. సీఎంసీ అధికారుల సమన్వయంతో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి(Town Planning Department) సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన(Cyberabad Municipal Commissioner Srujana) మరోసారి కీలక ఆదేశాలు జారీ చేశారు.7 మీటర్లకు మించి ఎత్తులో నిర్మించిన భవనాలను గుర్తించాలని విభాగానికి ఆదేశాలిచ్చారు. 75 చ.గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలను గుర్తించాలని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ తేల్చిచెప్పారు.






