10 March, 2026 | 9:18 PM

వడల్పర్తి గ్రామంలో పశువులకు గాలికుంటు టీకాల కార్యక్రమం

10-03-2026 07:26 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): పశువులలో వ్యాపించే ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ (గాలికుంటు వ్యాధి) నివారణ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎఫ్‌ఎమ్‌డీ టీకాల కార్యక్రమం భాగంగా వడల్పర్తి గ్రామంలో మంగళవారం గాలికుంటు టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మార్చి 10 నుండి ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నట్లు మండల పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు.

వదలపర్తి గ్రామంలో మొత్తం తెల్ల పశువులకు 18, గేదెలకు 56 టీకాలు వేసినట్లు మండల పరిషత్ వైద్యాధికారి రవికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ... పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు ఈటీకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ, ఉప సర్పంచ్ శ్యామల గంగారం, విఏఎస్ విజయ, సిబ్బంది గౌస్, జయరాజ్, గంగారాం, పరంధాములు తదితరులు పాల్గొన్నారు.