16-02-2026 12:08:06 AM
మహబూబాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు లభించిన ఓట్లలో స్వల్ప తేడా ఉన్నప్పటికీ కౌన్సిలర్ సీట్ల విజయంలో భారీ తేడా వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి 1,09,823 ఓట్లు రాగా, ప్రతిపక్ష టిఆర్‌ఎస్ కు 1,02,465 ఓట్లు దక్కాయి.
16,770 ఓట్లతో 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే కౌన్సిలర్ సీట్ల విషయంలో భారీ తేడా వచ్చింది. 12 మున్సిపాలిటీలో 260 కౌన్సిలర్ పదవులకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ 140 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ 88 స్థానాలకు పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సీట్లకు పొంతన లేకుండా పోయింది. ఆయామున్సిపాలిటీలో ఆయా పార్టీలకు లభించిన ఓట్లు, కౌన్సిలర్ సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కేసముద్రం (16), కాంగ్రెస్ (8) 6,209
బీఆర్‌ఎస్ (8) 6,752, హబూబాబాద్ (36,కాంగ్రెస్ (13) 16,804, బీఆర్‌ఎస్ (11) 17,642బీజేపీ (1) 1,252,సీపీఎం (3),సీపీఐ (3),ఇతరులు (5). మరిపెడ (15),కాంగ్రెస్ (9) 5,450,బీఆర్‌ఎస్ (5) 4,725,ఇతరులు(1).తొర్రూరు (16),కాంగ్రెస్ (7) 7,997, బీఆర్‌ఎస్ (9) 7,718. నర్సంపేట (30) కాంగ్రెస్ (21) 17,358,బీఆర్‌ఎస్ (6) 13,753, బీజేపీ (1) 1,645, సీపీఎం (1)ఇతరులు (1).
వర్ధన్నపేట (12), కాంగ్రెస్ (5) 3,709, బీఆర్‌ఎస్ (6) 3,976, ఇతరులు (1).
పరకాల (22) ,కాంగ్రెస్ (13) 8,670, బీఆర్‌ఎస్ (6) 8,534, బీజేపీ (3) 3,542
జనగామ (30)కాంగ్రెస్ (12) 12,057,బీఆర్‌ఎస్ (13) 12,860,సీపీఎం (1),ఇతరులు (4).
స్టేషన్ ఘనాపూర్ (18),కాంగ్రెస్ (13) 7,573,బీఆర్‌ఎస్ (5) 4,988,ములుగు (20),కాంగ్రెస్ (12) 4,999,బీఆర్‌ఎస్ (5) 3,418,బీజేపీ (1) 1,667,ఇతరులు (2)
భూపాలపల్లి (30),కాంగ్రెస్ (16) 14,638,బీఆర్‌ఎస్ (10)13,949,బీజేపీ (2) 2,789,సీపీఐ (1),ఇతరులు (1)
డోర్నకల్ (15),కాంగ్రెస్ (11) 4,379,బీఆర్‌ఎస్ (4) 3,147,