16 July, 2026 | 12:23 AM

మా చిత్రాన్ని వదలకుండా చూడండి

16-07-2026 12:04 AM

చరిత చిత్ర బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నర్మించిన చిత్రం ‘వదలా’. జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో ఆకెళ్ల వీ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని జూలై 17న రిలీజ్ చేయబోతోన్నారు.

ఈ క్రమంలో మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో జగపతిబాబు మాట్లాడుతూ.. “ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. ఈ మూవీలో విషయం ఉంది, కంటెంట్ ఉంది అని నమ్మాను. అందుకే ప్రతీ విషయంలో నేను జాగ్రత్తగా తీసుకున్నా. ఈ సినిమాకింకా బిజినెస్ కాలేదు. ప్రేక్షకులు మా చిత్రాన్ని వదలకుండా చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా” అని చెప్పారు.

నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. “ఓ పదేళ్ల క్రితం వైరాగ్యంతో సినీ సన్యాసం తీసుకుంటే.. కిశోర్ మాత్రం ‘వదలా’ అనే సినిమా నిర్మించాల్సిందేనని పట్టుబట్టారు. పన్నెండేళ్ల క్రితం మేకింగ్ ఆపేశా. నా ప్రొడక్షన్స్‌లో ‘అంతఃపురం’ తర్వాత ఇదే బెస్ట్ ఫిల్మ్‌” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్ర నిర్మాత కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, ‘రాజు వెడ్స్ రాంబాయి’ నిర్మాత నాగేశ్వర్‌రావు, యువ నటి హృతిక శ్రీనివాస్, సంగీత దర్శకుడు కార్తీక్ బీ కొడకండ్ల, కెమెరామెన్ చోటా కే నాయుడు, లిరిసిస్టులు కృష్ణవేణి మల్లవజ్జల, శివకృష్ణాచారి ఎర్రోజు, వీరు గడ్డం మాట్లాడారు.