7 July, 2026 | 7:30 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

20 సెకన్లలో 17 చెంపదెబ్బలు

08-11-2025 01:01 AM
  1. దోపిడీకి వచ్చిన మహిళకు షాక్ 
  2. కళ్లలో కారం కొట్టగానే యాజమాని దాడి

లక్నో, నవంబర్ 7: ఏమీ తెలియని అమాయకురాలిగా నగల దుకాణంలోకి ప్రవేశించింది. ఉన్నట్టుండి ఎదురుగా కూర్చున్న యజమాని కంట్లో కారం కొట్టింది. అంతే.. సీట్‌లో కూర్చున్న ఒక్క ఉదుటన లేచి సదరు మహిళను చేతిలో పట్టుకుని 20 సెకన్లలో ఏకధాటిగా 17 చెంపదెబ్బలు కొట్టాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలయ్యాయి. అహ్మదాబాద్‌లోని రానిప్ ఏరియాలోని ఓ నగల దుకాణానికి ఒక మహిళ ముఖానికి దుపట్టా కట్టుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది. యాజమాని కళ్లలో కారం కొట్టి నగలు దోచుకెళ్లాలని పథకం వేసింది.

దీనిలోభాగంగానే యజమాని కళ్లలో కారం కొట్టింది. అప్రమత్తమైన షాపు యజమాని వెంటనే ఎదురు దాడి ప్రారంభించాడు. 20 సెకన్లలో దాదాపు 17 సార్లు చెంపదెబ్బలు కొట్టి, ఆమెను షాపులోంచి బయటకు నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. షాపులో సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.