7 July, 2026 | 6:32 PM

Breaking News

సీసీ రోడ్ల పనులు ప్రారంభం   •   జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి   •   విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •   ఆదివాసి నాయకపోడ్ కులస్తులకు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు   •   ప్రభుత్వ ఉచిత విద్యను, సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరాలి   •   విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన పెద్దకాపర్తి సర్పంచ్   •   గౌలిగూడ కు వెళ్లాలా... అయితే ముక్కు మూయాల్సిందే...!   •   మృతుల కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం   •  

విజయ్ పగటికలలు కంటున్నారు !

08-11-2025 01:03 AM
  1. ఇప్పటికే సీఎం అయ్యారనుకుంటున్నారు
  2. ఆయన ఆశలన్నీ ఎండమావులని ఎన్నికల్లో తేలుతుంది
  3. ఎండీఎంకే అధినేత వైగో 

చెన్నై, నవంబర్ 7:  తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తనకు అధికారం వస్తుందని పగటి కలలు కంటున్నారని మరములార్చి ద్రావిడ మున్నెట్ర కళగం (ఎండీఎంకే) అధినేత వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీవీకే, -డీఎంకే మధ్యే ఉంటుందా..? అని శుక్రవారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

విజయ్‌కి రాజకీయాల్లో కనీసం ఓనమాలు కూడా తెలియ వని, గాల్లో మేడలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయ్ ఇప్పటికే ముఖ్యమంత్రి అయినట్లు.. తనకు తానే భావిస్తున్నారని విమర్శించారు. సముద్రాన్ని పేపరు పడవ ఈదాలని చూడటం మూర్ఖత్వమని పేర్కొన్నారు. ఆయన కలలన్నీ చివరకు ఎండమావులవుతాయని గుర్తించలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు.

కరూర్ తొక్కిస లాట బాధిత కుటుంబాలను ఓ రిసార్టుకు ఆహ్వానించడంపై వైగో మండిపడ్డారు. బాధిత కుటుంబాలను వారి నివాసాల్లోనే పరామర్శించకుండా, రిసార్టుకు పిలిపించుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి పరిణామం చూడలేదని, అది ఒక కుట్ర అని ఆరోపించారు. గతంలో తూత్తుకుడిలో నిరసనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో 13 మంది చనిపోతే.. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి తాను స్వయంగా పరామర్శించానని గుర్తుచేశారు.