3 June, 2026 | 7:21 PM

రక్షణ వెల్ఫేర్ సొసైటీ పునరావాస కేంద్ర స్థల పరిశీలన

03-06-2026 06:15 PM

త్వరితగతిన పూర్తికానున్న ప్రాజెక్టు

హర్షం వ్యక్తం చేసిన రక్షణ వెల్ఫేర్ సొసైటీ బృందం

ఖమ్మం,(విజయక్రాంతి): అందరూ ఉండి అనాథగా మిగిలిపోయిన వయోవృద్ధులు... ఆసరా లేని వృద్ధ మహిళలు..., ప్రకృతి వైపరీత్యాలలో తల దాచుకునేందుకు  పునరావాస కేంద్రం కోసం, కేవలం వృద్ధ మహిళల పరిరక్షణ  కోసం రక్షణ వెల్ఫేర్ సొసైటీ సంస్థ ముందుకు వచ్చి వృద్ధాశ్రమం, & రక్షణ వెల్ఫేర్ పునరావాస కేంద్రం ఏర్పాటుకోసం రక్షణ వెల్ఫేర్ సొసైటీ  వడివడిగా కార్యచరణను వేగవంతం చేసింది. అందులో భాగంగానే బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని హైవే రోడ్డు చెంతన 1600 గజాల విస్తీర్ణంలో సువిశాల ప్రదేశంలో వృద్ధ మహిళలకు  తమ స్వస్థలాన్ని మైమరపించే విధంగా అన్ని ఏర్పాట్లను చేయబోతుంది రక్షణ వెల్ఫేర్ సొసైటీ సంస్థ.

అందులో భాగంగానే సంస్థ వ్యవస్థాపకురాలు పోలేపల్లి సుజాత మాట్లాడుతూ.. నిర్మాణ పనులు... ప్రభుత్వ అనుమతులు, పలు అంశాలలో కార్యచరణను వేగవంతం చేసినట్లు ఫౌండర్ సుజాత పేర్కొన్నారు. వయవృద్ధుల సౌకర్యార్థం అన్ని మౌలిక వసతులు తమ నివాస సముదాయాలను తలపించే విధంగా సివిల్ ఇంజనీర్, ఇంటీరియర్ డిజైనర్లు  ప్లానింగ్ ఆర్కిటెక్ట్‌లతో  సమాలోచనలు చేసినట్లు ఆమె  తెలిపారు.

 వృద్ధులు, నిరుపేదలు ఆపదలో  ఉన్న వారికి ఈకేంద్రం ఉపయుక్తం కానుందని, సీనర్జీ ఇండియన్ ఫౌండేషన్ అధినేత సామెర్ల కిరణ్ కుమార్ సహకారంతోనే తాను సమర్థవంతంగా సామాజిక సేవలను నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సుజాత సామాజిక సేవలు  ఆదర్శప్రాయమని  పలువురు ఆమె సేవలను ప్రశంసిస్తున్నారు.