17 June, 2026 | 4:39 AM

‘అల్పాహారం’ వంటగది కోసం స్థల పరిశీలన

17-06-2026 02:09 AM

మేడ్చల్, జూన్ 16 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం పథకం కేంద్రీకృత వంటగది కోసం కలెక్టర్ మను చౌదరి స్థల పరిశీలన చేశారు. అలియాబాద్, కేశవరం లోని మూ సి ఉన్న బీసీ హాస్టల్ ను పరిశీలించారు. ఈ హాస్టల్స్ ఎప్పటి నుంచి మూసి ఉన్నాయి, స్థలం ఎంత ఉందని బీసీ వెల్ఫేర్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ రెండు హాస్టల్స్ స్థల వివరాల నివేదికను తనకు అందజేయాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. జిల్లాలో 22 పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. మన్న ట్రస్ట్ అల్పాహారం పథకం కాంట్రాక్టు దక్కించుకుంది.

పాఠశాల తనిఖీ 

కేశవరం జెడ్పీ హైస్కూల్‌ను కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని కొత్త అడ్మిషన్లు అయ్యాయని అడిగారు. పాఠశాలలో భోజనం ఎలా ఉందని, ఆట పరికరాలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగారు. ఆడుకోవడానికి ఏమైనా కావాలా అని విద్యార్థులను అడుగగా ఫుట్బాల్, క్రికెట్ కిట్లు కావాలని విద్యార్థులు కోరారు. త్వరలోనే అందిస్తా మని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా  బి సి వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ రాణి, షామీర్పేట్ తహసిల్దార్  శ్రీనివాస్, మూడు చింతలపల్లి తహసిల్దార్ మహమ్మద్ ఇద్రీస్ పాల్గొన్నారు.