ఘనంగా సీతారామ చంద్రస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన
అచ్చంపేట, ఆగస్టు 30: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వలొనిపల్లి గ్రామంలో రుద్రాంశ సహిత సీతా రామచంద్ర స్వామి ఆలయ నూతన విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పానుగంటి శ్రీదేవి, నరసింహ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ (MLA Dr. Rikudu Vamsi Krishna)హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం, యాగం, కలశాభిషేకాలు నిర్వహించగా, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణ, ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు గ్రామ పెద్దలు, యువత సహకరించారు. అనంతరం భక్తులకు ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






