28 March, 2026 | 2:31 AM

కామారెడ్డిలో ఘనంగా సీతారామ కల్యాణోత్సవాలు

28-03-2026 12:32 AM

పాల్గొన్న ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, వాయిస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి, స్వామి 

కామారెడ్డి, మార్చి 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. కామారెడ్డి రామాలయంలో సీతారామచంద్ర కళ్యాణోత్సవంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో ఆలయ కమిటీ చైర్మన్ కొక్కొండ రవీందర్ గుప్తా, ఆలయ కమిటీ ప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు.

కామారెడ్డి స్వప్నలో క్ కాలనీలోని సీతారామచంద్ర కళ్యాణం లో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి, స్వామి లు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీ హర్ష, పండితులు శ్రీనివాస శర్మ ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామ నగర్ కాలనీలోని భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో సీతారామ కళ్యాణాన్ని నిర్వహించారు.

ఆలయ కమిటీ చైర్మన్, పండితులు వసంత శర్మ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేపట్టారు. రైల్వే స్టేషన్, ఎన్జీవోస్ కాలనీ, వివేకానంద కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ లలో సీతారామ కళ్యాణాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. సీతారామచంద్రుని కృప కటాక్షాలు ప్రతి ఒక్క కుటుంబం పై ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామిలు అన్నారు.

ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ ల ఆధ్వర్యంలో సన్మానించారు. శావా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీతారామ చంద్రులను ఊరేగింపు నిర్వహించి కాలనీలో స్వామివారి తలంబ్రాలను పంపిణీ చేశారు. ప్రతి పెళ్లిలో శ్రీరామ నామస్మరణ తో కామారెడ్డి జిల్లా మారు మోగింది. ప్రశాంత వాతావరణంలో శ్రీరామనవమి వేడుకలు ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శనివారం సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని ఆలయ అర్చకులు శ్రీహర్ష తెలిపారు.  అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, 11వ వార్డ్ కౌన్సిలర్ రాణి శ్రీనివాస్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అంబారిపేటలో.. 

కామారెడ్డి అర్బన్, మార్చి 27(విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం నిర్వహిం చారు.  గ్రామ సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీరంగా కృష్ణమాచారి   కళ్యాణాన్ని నిర్వహించారు.  ఉప సర్పంచ్ సత్య గౌడ్ పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది