26 April, 2026 | 5:08 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఔరా అనిపించేలా సిర్గాపూర్ నూతన మేకల బజార్..!

26-04-2026 03:10 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా మేకలు, గొర్ల బజార్ సర్పంచ్ శ్రీనివాస్ రావ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ... మేకలు, గొర్ల బజార్ బజార్ ప్రారంభించిన కొద్ది సమయంలోనే రికార్డు నమోదైంది. బజార్ ప్రారంభమైన వెంటనే ఒక మేక అత్యధిక ధరకు అమ్ముడైంది. స్థానిక వ్యాపారుల సమాచారం ప్రకారం... ఆ మేకను రూ"20" వేలకు విక్రయించారు. బజార్ ప్రారంభమైన కొద్ది సమయంలోనే ఈ స్థాయి ధర రావడం రైతులు, వ్యాపారుల్లో ఆనందాన్ని కలిగించింది.

మేక కనీస ధర 14-16 వేల వరకు సంతలో రైతులు విక్రాయించారు. నేడు జరిగిన సంతలో అందజా 16 లక్షల లావాదేవీలు జరగయాన్నారు. ఈ మేకల/గొర్ల సంత ప్రతి ఆదివారం నిర్వహిస్తామని, మేకలు గొర్ల నీటి కొరకు సంపు ఏర్పాటు చేశామని, అంతే కాకా రైతులు, బేరస్థుల కోసం టెంట్, మంచి నీటి సదుపాయం ఉంటుందన్నారు. మేకలు గొర్ల విక్రాయించుకునే వారికీ గ్రామ పంచాయితీ తరుపును "0" రుసుము రిస్ప్ట్ ఇస్తామని అన్నారు. ఈ సంత ప్రతి ఆదివారం జరుగుతుందని, దీనిని చుట్టూ ప్రక్క మండల, గ్రామాల ప్రజలు సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు సర్పంచ్ శ్రీనివాస్ రావ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ రావ్, ఉప సర్పంచ్ బిక్షపతి, వార్డు మెంబర్లు, గ్రామస్థులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.