ఎస్ఐఆర్ ప్రక్రియ జిల్లాలో వేగవంతం
నిర్మల్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఎన్యుమరేషన్ ఫాం ల పంపిణీ ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రక్రియ పై పలు సూచనలు చేసినట్టు తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర భవేష్ మిశ్రా మాట్లాడుతూ... జిల్లాలో ఎన్యుమరేషన్ ఫాంల పంపిణీ ప్రక్రియ పూర్తయిందన్నారు.
అన్ని నియమాలు పాటిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహిస్తామని వివరించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






