21 July, 2026 | 9:26 PM

ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి

21-07-2026 06:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగంగా పూర్తి చేస్తున్నట్టు జిల్లా భవేష్ మిశ్రా తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, వీసి లో పలు సూచనలు చేసినట్టు వివరించారు. ఈ సందర్భంగా నిర్మల్  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో  ప్రక్రియ  వేగంగా జరుగుతున్నట్టు తెలిపారు.  వారంలోగా అన్ని  ఎస్ఐఆర్  వీలైనంత త్వరగా ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేస్తామన్నారు. ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారములో ఆధార్ నంబరు నమోదు చేయడం కేవలం ఐచ్చిక మాత్రమే అని, తప్పనిసరి కాదని వివరించారు. ప్రక్రియ పూర్తయ్యే వరకు పర్యవేక్షణ చేస్తున్నట్టు తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.