21 July, 2026 | 10:39 PM

Breaking News

ఐటీఐ-ఏటీసీ విద్యార్థులు ప్రైవేట్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

21-07-2026 09:09 PM

115 మంది ATC విద్యార్థులకు వివిధ కంపెనీల నియామక పత్రాలు అందజేసిన వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ ఐటీఐ-ఏటీసీలో శిక్షణ పూర్తి చేసి వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అభినందించారు.  మంగళవారం ఉట్నూర్ లోని ఏటీసీలో  శిక్షణ పొందిన నిరుద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో విస్తృత అవకాశాలు, మెరుగైన వేతనాలు, అనుభవంతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

చిన్న వయసులోనే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని పేర్కొంటూ, లక్ష్యం స్పష్టంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఎలా వెళ్లామన్నది కాదు, లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యమని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన లెక్చరర్లను అభినందించిన ఎమ్మెల్యే, తల్లిదండ్రులే తొలి దైవం, గురువులు రెండో దైవమని గుర్తుంచుకొని వారికి అండగా నిలవాలని సూచించారు. ఆత్మవిశ్వాసం, కృషి, ధైర్యం ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, తమలాంటి ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రైవేట్ ఉద్యోగాలు సాధించిన  నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.