21 July, 2026 | 10:48 PM

Breaking News

దుబాయ్‌లో బోనాల ఉత్సవాలు

21-07-2026 09:04 PM

ఉత్సవాల్లో పాల్గొన్న అల్రిష  గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్

కామారెడ్డి,(విజయక్రాంతి): దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ బోనాల పండుగ ఉత్సాహాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సొంత గడ్డ అయినా కామారెడ్డిలో నిర్వహించినట్లుగా బోనాలు పండుగ ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిపిఎఫ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్,  ఎన్ఆర్ఐ బోర్డ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పెద్ద సత్యం గౌడ్, జనరల్ సెక్రెటరీ అల్రిష  గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్, జి టి ఎఫ్ నాయకులు యుజ్వేందర్ ,శ్రీకాంత్, రాజేష్, వినోద్, సతీష్ రెడ్డి, సునీత, అభినవ్, రాజేశ్వర్, జిటిఎఫ్ నాయకులు, కామారెడ్డి జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు  కళ్యాణి, ఉష, కల్పన, లక్ష్మి, అక్క వైదేవీ శ్వేత, తదితరులు అక్క, చెల్లెలు పాల్గొన్నారు.