21 July, 2026 | 10:35 PM

Breaking News

బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై దొంగల కన్ను

21-07-2026 09:25 PM

ప్లాస్టిక్ కవర్ కట్ చేసి బంగారం చోరీ

కల్లూరు,(విజయ క్రాంతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ వద్ద గుర్తుతెలియని దొంగలు చాకచక్యంగా చోరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం… ఐతరాజు సుమలత అనే మహిళ సోమవారం (జూలై 20) సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కల్లూరు బస్టాండ్ నుంచి రామకృష్ణాపురం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో గుర్తుతెలియని దొంగలు ఆమె వెంట తీసుకెళ్తున్న ప్లాస్టిక్ కవర్‌ను కట్ చేసి,అందులో ఉన్న పర్సును అపహరించారు.ఆ పర్సులో సుమారు 23 గ్రాముల బంగారు గొలుసుతో పాటు రూ. 9,000 నగదు ఉన్నట్లు బాధితురాలు తెలిపింది.ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.