21 July, 2026 | 10:40 PM

Breaking News

దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...

21-07-2026 09:06 PM

ఎస్ఐఆర్ పై సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్

దేవరకద్ర: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో దేవరకద్ర నియోజకవర్గంలో గెలిచి రెండోసారి  కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కౌకుంట్ల, చిన్నచింతకుంట, దేవరకద్ర, మండలాల బిఎల్ఏలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో ఎస్ఐఆర్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని  మాట్లాడారు.

100 శాతం ఎస్ఐఆర్ పూర్తయిన  బూత్ లకు సంబంధించిన బిఎల్ఎ లను గోపనపల్లి వెంకటేశ ను ఎమ్మెల్యే జిఎంఆర్ సన్మానం చేసి మాట్లాడారు. పూర్తి చేసేందుకు ప్రతి బిఎల్వో కృషి చేయాలని, షిప్టెడ్ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని వరుస క్రమంలో అవకాశాలు ఇస్తామని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించే బాధ్యత నాదన్నారు. బిఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎంత దుష్ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.