10 March, 2026 | 1:01 AM

రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగికి గాయాలు

09-03-2026 10:29 AM

పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని సంజయ్ నగర్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి ఉద్యోగి(Singareni employee) తీవ్ర గాయాల పాలయ్యారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అతన్ని మణుగూరుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలు పాలైన 108 వాహనంలో సింగరేణి ఉద్యోగి ఖలీల్ పాషాను ప్రభుత్వ ఆసుపత్రిక తరలించి చికిత్స అందిచి, మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం సింగరేణి ఆసుపత్రికి తరలించారు. పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు యాప్ చేస్తున్నారు.