25 July, 2026 | 7:55 PM

బీబీనగర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

25-07-2026 06:41 PM

ఆలేరు,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచికరమైన ఆహారం, క్రీడా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించి, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్, సరుకుల నిల్వలో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల కోరిక మేరకు స్పోర్ట్స్ పరికరాలు, JEE, NEET పోటీ పరీక్షలకు పుస్తకాలు, శిక్షణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.