ఏఐటీయూసీ మహాసభలను జయప్రదం చేయాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్ రావు
తుంగతుర్తి (విజయ క్రాంతి): ఏఐటీయూసీ జిల్లా మూడో మహాసభలు ఆగస్టు 1 సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఏఐటియుసి నియోజకవర్గ మూడవ మహాసభ పద్మశాలి భవనంలో బొంకూరు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
106 సంవత్సరాల చరిత్ర కలిగి భారతదేశంలోని ఏకైక పెద్ద కార్మిక సంఘము అని తెలుపుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని ఈ మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమం రూపొందించుకోవడం కోసం దోహదపడతాయన్నారు. కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన సమరశీల పోరాటాలకు సన్నద్ధం చేయడం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడలను తక్షణమే రద్దు చేయాలని కోరారు.






