25 July, 2026 | 5:59 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

09-03-2026 03:18 AM

ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి 

ఘట్ కేసర్, మార్చి 8 (విజయక్రాంతి) : పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’  ’99-డేస్ యాక్షన్ ప్లాన్’లో భాగంగా ఆదివారం ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో ‘స్వచ్ఛ సండే డ్రైవ్ విత్ స్వచ్ఛ సాథిస్ అరౌండ్ పబ్లిక్ పారక్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోచారం డివిజన్లోని అన్నోజిగూడ పార్కులో జరిగిన ఈకార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వాణి పాల్గొన్నారు.

కాలనీవాసులు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల భాగస్వామ్యంతో పార్కు ఆవరణలోని చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరిచారు. ఈసందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పబ్లిక్ పార్కులను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ 99 రోజుల ప్రణాళికను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని  తెలిపారు.