25 July, 2026 | 7:54 PM

స్కావెంజర్ ల సమస్యలు పరిష్కరించాలి

25-07-2026 06:44 PM

ఆప్ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్

అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

భూపాలపల్లి టౌన్,(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న స్కావెంజర్ ల సమస్యలు పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ అన్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ... స్కావెంజర్ లకు పెండింగులో ఉండడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కావెంజర్ లకు రావాల్సిన పెండింగ్ వేతనాలు విడుదల చేయడంతో పాటు ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అరవింద్ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నూరి సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శి అస్లాం పాల్గొన్నారు.